ఏఐ సమ్మిట్‌లో చైనా రోబోల ప్రదర్శన.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-18 10:17:27  IST  )

ఏఐ సమ్మిట్‌లో చైనా రోబోలు వాడారంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. దేశ ప్రతిష్టను నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు

ఏఐ సమ్మిట్‌లో చైనా రోబోల ప్రదర్శన.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న 'భారత్ మండపం' (Bharat Mandapam) లో ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్ జరుగుతోంది. కాగా ఈ సమ్మిట్ కేవలం ఒక పబ్లిక్ రిలేషన్స్ (PR) ప్రదర్శనగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ సమ్మిట్‌లో చైనాకు చెందిన రోబోలను భారతదేశ సొంత ఉత్పత్తులుగా ప్రదర్శించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దేశానికి తీరని అవమానమని, చైనా మీడియా కూడా ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ భారతదేశాన్ని ఎగతాళి చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం చైనా రోబోలను (China's robots) భారతీయ ఉత్పత్తులుగా ప్రమోట్ చేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. భారతదేశం వద్ద అపారమైన డేటా, టాలెంట్ ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఏఐ రంగాన్ని ప్రభుత్వం ఒక జోక్‌గా మార్చేసిందని, భారతీయ డేటాను విదేశీ శక్తులకు (foreign powers) అమ్మకానికి పెడుతూ చైనా ఉత్పత్తులను ప్రదర్శించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి పనుల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం (Artificial Intelligence sector)లో ప్రపంచ నాయకుడిగా ఎదగాల్సిన భారతదేశాన్ని, ఒక అస్తవ్యస్తమైన పీఆర్ విన్యాసాలకు వేదికగా మార్చారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.

కుంగ్‌ఫూ విన్యాసాలతో అదరగొట్టిన చైనీస్ రోబోలు

AI సమ్మిట్‌లో చైనా రోబో వివాదంపై గల్గోటియాస్ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ

Next Story