- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంగ్‌ఫూ విన్యాసాలతో అదరగొట్టిన చైనీస్ రోబోలు
చైనా కొత్త సంవత్సరం వేడుకల్లో ఆ దేశంలో తయారైన హ్యూమనాయిడ్ రోబోలు కుంగ్‌ఫూ విన్యాసాలతో అదరగొట్టాయి.

దిశ, వెబ్ డెస్క్ : చైనీస్ న్యూ ఇయర్ ఉత్సవాల్లో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే ఒక ప్రదర్శన జరిగింది. ఫిబ్రవరి 17న లూనార్ న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా బీజింగ్‌లో ఓ భారీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హ్యూమనాయిడ్ రోబోల కుంగ్‌ఫూ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "నాకౌట్ మార్షల్ ఆర్ట్స్" పేరుతో జరిగిన ఈ ప్రదర్శనలో డజన్ల కొద్దీ రోబోలు యువ కుంగ్‌ఫూ మాస్టర్లతో సమన్వయం చేసుకుంటూ అద్భుతమైన స్టెప్స్ వేశాయి. యూనిట్రీ రోబోటిక్స్, గాల్బోట్, నోయెటిక్స్, మ్యాజిక్ ల్యాబ్ వంటి చైనా కంపెనీలకు చెందిన రోబోలు ఈ షోలో పాల్గొన్నాయి.
అదరగొట్టిన ప్రదర్శన
ఈ షోలో పాల్గొన్న రోబోలు అత్యంత వేగవంతమైన కిక్స్, బ్యాక్‌ఫ్లిప్స్, ఏరియల్ ఫ్లిప్స్, సింగిల్-లెగ్ ఫ్లిప్స్, టేబుల్-వాల్టింగ్ పార్కోర్ వంటి క్లిష్టమైన మూమెంట్స్ ను, కుంగ్‌ఫూమాస్టర్లతో కలిసి చాలా కచ్చితత్వంతో ప్రదర్శించాయి. 7.5 రొటేషన్ ఎయిర్‌ఫ్లేర్ గ్రాండ్ స్పిన్ వంటి అరుదైన స్టంట్స్‌ను అద్భుతంగా కూడా ప్రదర్శించాయి. అంతేకాదు సంప్రదాయ కుంగ్‌ఫూ ఆయుధాలు అయిన కర్రలు (స్టాఫ్), కత్తులు (స్వోర్డ్స్), నాన్‌చాక్‌లను రోబోలు సమన్వయంగా స్వింగ్ చేయడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. డ్రంకెన్ బాక్సింగ్ స్టైల్‌ను కూడా అనుకరించాయి. అంటే వంగుతూ, వెనక్కి పడిపోయి, వెంటనే మళ్లీ లేచి నిలబడటం వంటి ఫాల్ట్ రికవరీ టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ ప్రదర్శనలో ఒక్క రోబో కూడా బ్యాలెన్స్ కోల్పోకపోవడం మరింత విశేషంగా నిలిచింది.
ప్రేక్షకుల విస్మయం
షో పూర్తయ్యాక ప్రేక్షకులు నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దాదాపు 10 నిముషాల సేపు ఆపకుండా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం రోబోల ప్రదర్శన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. CNN, CGTN, Al Jazeera, Reuters, Guardian వంటి అంతర్జాతీయ మీడియా కూడా ఈ ప్రదర్శనపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి.
భవిష్యత్తు రోబోల మయమేనా?
గత ఏడాది అంటే 2025 గాలాలో రోబోలు కేవలం డ్యాన్స్ మాత్రమే చేశాయి. కానీ 2026లో అవి రియల్-టైమ్ అడ్జస్ట్‌మెంట్స్, AI క్లోజ్డ్-లూప్ కంట్రోల్‌తో క్లిష్టమైన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించడం రోబోటిక్స్ రంగంలో అతి పెద్ద పురోగతిగా అభిప్రాయపడుతున్నారు. చైనా టెక్నాలజీ డెవలప్మెంట్, సంప్రదాయ కుంగ్‌ఫూ కళల కలయికకు ఈ ప్రదర్శన ప్రతీకగా నిలిచింది. భవిష్యత్తులో రోబోలు మనుషులతో ఎలా కలిసి పనిచేస్తాయో ఒక స్పష్టమైన దృశ్యాన్ని కళ్ళ ముందు నిలిపింది.






