ఐపీఎల్‌లో 'బాల కార్మిక' సెగ.. వైభవ్ సూర్యవంశీని ఇంటికి పంపేయాలని డిమాండ్!

by Malleboina Mahesh |   (  Updated:2026-05-02 16:34:19  IST  )

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆడటంపై వివాదం! 15 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం బాల కార్మిక వ్యవస్థ కిందకు వస్తుందని, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓ యాక్టివిస్ట్ డిమాండ్ చేశారు.

ఐపీఎల్‌లో బాల కార్మిక సెగ.. వైభవ్ సూర్యవంశీని ఇంటికి పంపేయాలని డిమాండ్!
X

దిశ, వెబ్ డెస్క్: 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ 2025 లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) యువ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 2026 సీజన్ ప్రారంభం నుంచి సంచనాలను సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో అతని కారణంగా ఐపీఎల్ కు 'బాల కార్మిక' సెగ తగిలింది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ (IPL) ఆడటంపై ఒక కన్నడ టీవీ ఛానల్‌ వేదికగా ఒక సామాజిక కార్యకర్త తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల వయసున్న పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం చైల్డ్ లేబర్ (Child labor) కిందకు వస్తుందని, అతడిని వెంటనే టోర్నీ నుంచి తొలగించి ఇంటికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం (Rajasthan Royalsowners) దీనిపై చర్యలు తీసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు యాక్టివిస్ట్ హెచ్చరించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్యవంశీ వయసులో చిన్నవాడని, అతను క్రికెట్ ఆడే బదులు చదువుకోవాలని ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్ల బాలుడు ఇటువంటి భారీ ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడటం చట్టవిరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ విషయంలో ఈ రకమైన వివాదం రేగడం ఇప్పుడు క్రీడారంగంలో చర్చనీయాంశంగా మారింది.

Read More...వైభవ్‌ను చూస్తే నిజంగా భయమేస్తోంది’.. న్యూజిలాండ్ స్టార్ జేమీసన్ ఓపెన్ స్టేట్‌మెంట్

Next Story