- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనలు వృధా ప్రయాస.. ఎంపీ రాజీవ్ శుక్లా సంచలన విమర్శలు
స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున వెళ్లారు. దీనిపై రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా (Rajya Sabha MP Rajiv Shukla) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు విమర్శలు చేశారు. భారత్ కు చెందిన వారి పర్యటనలను ఆయన ప్రజా ధనాన్ని "నేరపూరితమైన రీతిలో వృధా" చేయడం అని అభివర్ణించారు. భారతీయులు వేల కిలోమీటర్ల దూరం దావోస్‌కు వెళ్లి అక్కడ మళ్ళీ భారతీయులనే కలుస్తూ, దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు (MoUs) చేసుకోవడం విడ్డూరంగా ఉందని, ఇటువంటి పనులు భారత్‌లోనే తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.
దావోస్ వేదికగా విదేశీ కంపెనీలతో పెట్టుబడి ఒప్పందాలు చేసుకుంటే అది దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్'లా కాకుండా 'ఇండియా ఎకనామిక్ ఫోరమ్ ('India Economic Forum') లా కనిపిస్తోందని రాజీవ్ శుక్లా 'X' వేదికగా విమర్శించారు. ఏడుగురు ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి కేవలం ప్రదర్శన (Show off) కోసమే ఇవన్నీ చేస్తున్నారని, ఇది కేవలం ఒక స్టేటస్ సింబల్‌గా మారిందని ఆయన మండిపడ్డారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించకుండా కేవలం దేశీయ సంస్థలతో ఒప్పందాల కోసం విదేశీ పర్యటనలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎంపీ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Read More..






