Telangana Inti Party: కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం.. పార్టీలో చేరిన చెరుకు సుధాకర్

by Disha Web Desk 2 |
Cheruku Sudhakar Merges Telangana Inti Party Into Congress Party at Delhi
X

దిశ, వెబ్‌డెస్క్: Cheruku Sudhakar Merges Telangana Inti Party Into Congress Party at Delhi| తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. శుక్రవారం చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. చెరుకు సుధాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మరో పక్క చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరికపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని చూసిన చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని సొంత నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఇకనుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖం చూడా చూడబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: ఇకపై రేవంత్ రెడ్డి ముఖం చూడను.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed