- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక లాభాలంటూ ఆశ.. రూ.21 కోట్లు మోసపోయిన చార్టెడ్ అకౌంటెడ్
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ చార్టర్డ్ అకౌంటెంట్(CA) ఏకంగా రూ.21 కోట్లు మోసపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ చార్టర్డ్ అకౌంటెంట్(CA) ఏకంగా రూ.21 కోట్లు మోసపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన ఉండే ఒక సీఏ స్థాయి వ్యక్తే ఇంత భారీ మొత్తంలో మోసపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఆరు నెలల పాటు నమ్మించి
పోలీసుల కథనం ప్రకారం.. గ్వాలియర్‌కు చెందిన సదరు చార్టర్డ్ అకౌంటెంట్‌ను గత ఏడాది డిసెంబరులో ఒక గుర్తు తెలియని మహిళ వాట్సప్ ద్వారా సంప్రదించింది. తానొక అంతర్జాతీయ పెట్టుబడుల సలహాదారునని పరిచయం చేసుకుని, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే ఊహించని రీతిలో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది. బాధితుడికి నమ్మకం కలిగించేందుకు నిందితులు ప్రత్యేకంగా ఒక నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. బాధితుడు పెట్టిన పెట్టుబడులకు ప్రతిరోజూ స్క్రీన్‌పై భారీగా డిజిటల్ లాభాలు వస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌లో గ్రాఫిక్స్ ద్వారా తప్పుడు వివరాలు చూపించేవారు. అది నిజమైన లాభమేనని గుడ్డిగా నమ్మిన సదరు సీఏ.. గత ఆరు నెలల వ్యవధిలో విడతల వారీగా ఏకంగా 100 లావాదేవీల (Transactions) ద్వారా మొత్తం రూ.21 కోట్లను కేటుగాళ్లు చెప్పిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
సైబర్ క్రైమ్ దర్యాప్తు
చివరికి తాను ఇన్వెస్ట్ చేసిన అపారమైన సొమ్మును, వచ్చిన లాభాలను వెనక్కి విత్‌డ్రా (Withdraw) చేసుకునేందుకు ప్రయత్నించగా సాంకేతిక కారణాలు చెప్తూ నిలిపివేయడంతో తాను దారుణంగా మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే స్పందించి, నేరగాళ్లకు సంబంధించిన కొన్ని బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. ఆ అకౌంట్లలో ఉన్న రూ.1.75 కోట్ల సొమ్మును ఫ్రీజ్ చేసారు. ఈ అంతరాష్ట్ర సైబర్ ముఠా వెనుక ఏమైనా విదేశీ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల, ఆన్‌లైన్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, వాట్సప్ సలహాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
భార్య పుట్టినరోజునాడే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన భర్త






