కాలనీలలో వ్యర్దాలు లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎంఎంసీ కమీషనర్ వినయకృష్ణారెడ్డి

by Kodari Anjali |

వ్యర్థ పదార్థాలను తొలగించే ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సానిటేషన్ సిబ్బందికి సూచించారు.

కాలనీలలో వ్యర్దాలు లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎంఎంసీ కమీషనర్ వినయకృష్ణారెడ్డి
X

దిశ, చైతన్యపురి: గృహ నిర్మాణదారులు తమ నివాసాల ముందు పడబోసిన వ్యర్థ పదార్థాలను గమనించి రాంకీ సిబ్బందికి చెప్పి తొలగించే ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె. వినయకృష్ణారెడ్డి సానిటేషన్ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఎల్బీనగర్ జోన్ చైతన్యపురి డివిజన్ న్యూమారుతినగర్, ఫణిగిరికాలనీ, లక్ష్మీనరసింహ కాలనీలలో ఆయన పర్యటించారు. ఈసందర్బంగా పలు సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు సూచనలు చేసారు. కాలనీలలో వేలాడుతున్న కరెంట్ వైర్లను సరిచేయాలన్నారు. ట్రేడ్ లైసెన్సులు రెన్యూవల్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గృహ యజమానులు నివాసాల ముందు ఏర్పాటు చేసుకున్న ప్లాంట్ బాక్స్‌లలో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్, శానిటేషన్ డిఈఈ చందన, టౌన్ ప్లానింగ్ ఏసీపీ అంబిక ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story