పైనల్ దశకు చేరుకున్న ప్రశాంత్ వర్మ తదుపరి ప్రాజెక్ట్.. ఫొటోలతో అప్డేట్ ఇచ్చిన టీమ్

by Chukka Sudharani |   (  Updated:2026-07-14 10:30:32  IST  )

‘హనుమాన్’ సినిమాతో టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశంత్ వర్మ..

పైనల్ దశకు చేరుకున్న ప్రశాంత్ వర్మ తదుపరి ప్రాజెక్ట్.. ఫొటోలతో అప్డేట్ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: ‘హనుమాన్’ సినిమాతో టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశంత్ వర్మ.. ప్రస్తుతం తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రాబోయే తదుపరి అద్భుతమైన అధ్యాయం ‘మహాకాళి’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ మేరకు సెట్ నుంచి టీమ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘125 రోజుల చిత్రీకరణ తర్వాత, 'హనుమాన్ యూనివర్స్'లోని తదుపరి అధ్యాయం ‘మహాకాళి’ తన చివరి షూటింగ్ దశలోకి ప్రవేశించింది. ఇందులో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్ తమ భాగాలకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశారు’ అని తెలిపారు. భూమి శెట్టి ‘మహాకాళి’ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (అసురగురు శుక్రచార్యుడు), రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్‌కెడి స్టూడియోస్ పతాకంపై ఆర్‌కే దుగ్గల్, రివాజ్ రమేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా.. IMAX కోసం చిత్రీకరిస్తున్న ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

రామ్ చరణ్-సుకుమార్ ‘RC-17’సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో స్టార్ హీరోయిన్?

Next Story