- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆంధ్రా కశ్మీర్’ లంబసింగిలో కేరళ తరహా గ్లాంపింగ్ డోమ్ టెంట్లు.. త్వరలో అందుబాటులోకి
ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో పర్యాటకులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో పర్యాటకులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 15 జియోడెసిక్ గ్లాంపింగ్ డోమ్ టెంట్ల పనులు 75 శాతం పూర్తయినట్లు అధికారుల సమాచారం. మరో రెండు నెలల్లో ఇవి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేరళ తరహాలో నిర్మిస్తున్న ఈ డోమ్ టెంట్లు ఒక్కొక్కటి సుమారు 725 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన వసతులతో రూపొందుతున్నాయి. భారీ బెడ్, రాకింగ్ చైర్, వార్డ్‌రోబ్, కాఫీ టేబుల్, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక వ్యూ బాల్కనీలతో వీటిని తీర్చిదిద్దుతున్నారు. పిల్లల కోసం ఓపెన్ ప్లే ఏరియా, రిసార్ట్‌లో సంచరించేందుకు ఈవీ బగ్గీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం హరిత రిసార్ట్స్‌లో ఉన్న ఏసీ సూట్లు, నాన్ ఏసీ కాటేజీలతో పాటు ఈ టెంట్లు అందుబాటులోకి వస్తే మొత్తం గదుల సంఖ్య 30కు చేరనుంది. పెరుగుతున్న పర్యాటకుల రద్దీకి అనుగుణంగా వసతులు విస్తరించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ఏపీటీడీసీ యూనిట్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. రిసార్ట్స్‌లో నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.






