- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అమెరికా చర్యలు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అమెరికా న్యాయశాఖ చర్యలపై స్పందించిన MEA.. ఉగ్రవాదం, నేర ముఠాల అణచివేతకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామన్న రణధీర్ జైస్వాల్!

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం గా మారుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై అమెరికా చెపట్టిన చర్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ గ్యాంగ్ పలు దేశాల్లో విస్తరించి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర ముఠాగా మారింది. దీంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై అమెరికా న్యాయ శాఖ (US Department of Justice) చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఈ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని మోపిన అభియోగాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ అంతర్జాతీయ ఆపరేషన్‌పై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు.
ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపై భారత్-అమెరికా ఉమ్మడి పోరు..
సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా (Narco Trafficking), మానవ రవాణా, అక్రమ ఆయుధాల సరఫరా వంటి క్రిమినల్ నెట్‌వర్క్‌లు ప్రపంచ సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవని భారత్ మొదటి నుంచి బలంగా చెప్తోంది. ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేర ముఠాలను అణచివేయడంలో భారత్ - అమెరికా మధ్య అత్యంత బలమైన, సమర్థవంతమైన సహకారం ఉంది" అని స్పష్టం చేశారు. ఇరు దేశాలకు చెందిన భద్రతా, దర్యాప్తు సంస్థలు గత కొన్నేళ్లుగా పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నాయని, రానున్న రోజుల్లో ఈ సమన్వయం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆయన వెల్లడించారు.






