- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డిపై జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఫిర్యాదు
సీఎం వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

దిశ, జడ్చర్ల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ కమలాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 11న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023 నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో కరవు పరిస్థితులపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులు, రైతులను లక్ష్యంగా చేసుకుని హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ముఖ్యమంత్రి తన హోదాకు తగిన విధంగా వ్యవహరించాలని, వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






