- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందల కోట్ల అక్రమాస్తులు.. హెచ్ఎండీఏ చీఫ్ రవీందర్ అరెస్ట్
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇళ్లపై ఏసీబీ మెరుపు దాడులు.. వందల కోట్ల బహిరంగ మార్కెట్ విలువైన అక్రమాస్తులు గుర్తింపు, అరెస్ట్!

దిశ, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ (CE) బచ్చు రవీందర్ నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై ఇవాళ ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు, ఊహించని స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. గచ్చిబౌలిలోని ప్రముఖ సుమధుర టవర్స్ లోని రవీందర్ ప్రధాన నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం 10 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఒకేసారి రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. అనంతరం భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికాలుగు గుర్తించారు. ఈ రోజు జరిగిన సోదాల్లో కిలోన్నర బంగారం, 12.5 కిలోల స్థిర, చరాస్తులు కలిపి 9. 24 కోట్లు గుర్తించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉంటుదని అధికారులు గుర్తించారు. అనంతరం ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.






