తలపై దాడితో వృద్ధుడి దారుణ హత్య

by Ratna Kumari |   (  Updated:2026-07-14 15:01:49  IST  )

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లి గ్రామంలో మంగళవారం వృద్ధుడి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తలపై దాడితో వృద్ధుడి దారుణ హత్య
X

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లి గ్రామంలో మంగళవారం వృద్ధుడి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బు తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన కాంపెల్లి హనుమయ్య (70)పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తలపై బలంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన హనుమయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న మల్యాల సీఐతో పాటు స్థానిక ఎస్సై నరేష్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు భూ వివాదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నప్పటికీ, దీనిపై అధికారికంగా పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story