- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
48 గంటల్లో హత్య కేసు ఛేదించిన చిలకలగూడ పోలీసులు
అక్రమ సంబంధం అనుమానంతో ఓ కార్మికుడిని కత్తితో గొంతుకోసి హత్య చేసిన కేసును చిలకలగూడ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.

దిశ, సికింద్రాబాద్: అక్రమ సంబంధం అనుమానంతో ఓ కార్మికుడిని కత్తితో గొంతుకోసి హత్య చేసిన కేసును చిలకలగూడ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 11న ఆర్‌ఎంసీ ప్లాంట్ లేబర్ క్యాంపులో పనిచేస్తున్న పప్పు సింగ్ తన గదిలో రక్తపు మడుగులో పడి ఉండగా సహచర కార్మికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే మెడపై తీవ్ర గాయాలతో అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు సాక్షులను విచారించారు. విచారణలో బీహార్‌కు చెందిన అనిల్ కిస్కు తన భార్య మొహిని, మృతుడు పప్పు సింగ్ మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ వారితో తరచూ గొడవపడుతున్నట్లు గుర్తించారు.
నిందితుడు కత్తిని గదిలో దాచిపెట్టి..
జూలై 11 మధ్యాహ్నం ఇద్దరూ కలిసి మద్యం సేవించిన సమయంలో ఈ విషయమై మళ్లీ వాగ్వాదం జరగగా, అక్కడే ఉన్న కూరగాయలు కోసే కత్తితో పప్పు సింగ్ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు కత్తిని గదిలో దాచిపెట్టి, తనపై అనుమానం రాకుండా ఇతర కార్మికులతో కలిసి బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు నాటకం ఆడినట్లు వెల్లడించారు. శాస్త్రీయ ఆధారాలు, సీసీటీవీ విశ్లేషణ, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా జూలై 13న నిందితుడు అనిల్ కిస్కు (30), బహదూర్‌పూర్ గ్రామం, కతిహార్ జిల్లా, బీహార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించడంతో, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వి. రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సమన్వయంతో వేగంగా దర్యాప్తు జరిపి ఈ హత్య కేసును కేవలం 48 గంటల్లోనే చేదించారు.






