కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు

by Ratna Kumari |

అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకుని అధికారులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.

కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు
X

దిశ, దుండిగల్ : బహదూరపల్లికి చెందిన కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులు విధి నిర్వహణలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులతో దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 10న రోడ్ల ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ సమయంలో కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులు అధికారుల విధులను అడ్డుకుని, సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నం. 690/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్ 132 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి. సతీష్ తెలిపారు.

Next Story