- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : కలెక్టర్ కె. హరిత
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటి అవసరం గల ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, ఆసిఫాబాద్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటి అవసరం గల ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు, భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బోరుబావుల ఆధారంగా సాగు చేస్తున్న రైతులు కూడా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, కంది వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు. జూలై 31 వరకు కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగితే, ఆగస్టు మొదటి వారంలో కందులు, ఉలవలు, అలసందలు, ఆముదం, నువ్వులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విత్తనాలను విత్తుకోవడం రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని, దీంతో నష్టాల నుంచి రైతులు బయటపడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్‌లో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. అలాగే లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.






