ఎన్యూమరేషన్ ఫారం ఇస్తేనే ఓటు హక్కు: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి

by Malleboina Mahesh |

ఎన్యూమరేషన్ ఫారం ఇస్తేనే డ్రాఫ్ట్ జాబితాలో ఓటరు పేరు నమోదు.. మరో 10 రోజుల్లో గడువు ముగింపు: తెలంగాణ సీఈఓ సి.సుదర్శన్ రెడ్డి!

ఎన్యూమరేషన్ ఫారం ఇస్తేనే ఓటు హక్కు: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని, లేకుంటే ఓటు హక్కులను తొలగించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అందజేసిన ఎన్యూరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి బీఎల్వోలకు వెంటనే అందజేసి మీ అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బీఎల్ఓలు అందజేసిన ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా పూరించి, పాస్ ఫోర్ట్ సైజు ఫొటోను అతికించి బీఎల్ఓలకు అందించాలని ఆయన కోరారు. ఎన్యూమరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటర్ సంతకం, తేదీతో పాటు బీఎల్ఓల సంతకం ఉండేలా చూసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ఓటర్లకు అందజేసిన రెండు ఎన్యూమరేషన్ ఫారాల్లో ఒకటి బీఎల్వోలకు ఇవ్వాలని, మరొకటి ఓటర్ భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు.

పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని స్పష్టం చేశారు. 2002 ఓటరు జాబితాలో ఓటర్ వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అటువంటి వివరాలను లేకపోయిన ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్ఓలకు అందజేయాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,66,70,610 మంది (49.28శాతం) ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించారని తెలిపారు. సర్ ప్రక్రియ జూన్ 25 నాడు ప్రారంభమైందని, మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని, ఓటర్లు పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈరోజే బీఎల్వోలకు అందజేయాలని సూచించారు.

Next Story