- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లాండ్ కు బిగ్ షాక్..తొలి వన్డేలో భారత్ విజయం
ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్, తొలి వన్డేలో విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్: టీ20 సిరీస్ లో వరుసగా ఓటమిపాలైన భారత జట్టు, వన్డేల్లో మాత్రం పంజా విసిరింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో మెరిసిన భారత్...సూపర్ విక్టరీ అందుకుంది. ఇంగ్లాండ్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని, ఓపికగా ఆడి 6 వికెట్ల తేడాతో గెలిచింది భారత్. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విఫలమైనప్పటికీ.. కెప్టెన్ గిల్ భారాన్ని మొత్తం మోసాడు. సెంచరీ మిస్ చేసుకున్న గిల్ 80 పరుగులు చేయగా... అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ఫినిష్ చేశారు. ఈ ఇద్దరు అర్థ సెంచరీలు నమోదు చేసుకొని, భారత జట్టుకు ఊపిరి పోసారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్...1-0 తేడాతో వన్డే సిరీస్ లో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో రెండు వన్డేలు ఉన్నాయి.
Next Story





