ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మాజీ కెప్టెన్లు

by velandi.Saikiran |

ఇంగ్లాండ్ తో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో..ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మాజీ కెప్టెన్లు సంద‌డి చేశారు.

ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మాజీ కెప్టెన్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మంగళవారం రోజున తొలి వన్డే జరిగింది. టీ20లలో విఫలమైన భారత జట్టు, తొలి వన్డేలో మాత్రం మంచి ఆరంభాన్ని అందుకుంది. గిల్ కెప్టెన్సీ లోని భారత్... ఇంగ్లాండ్ పై ఏకంగా 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని సందడి చేశారు. తొలి వన్డే చూసేందుకు మిస్టర్ కూల్ ధోని స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలో ప్రేక్షకులతో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేశారు.

గాగుల్స్ ధరించి స్టైలిష్ లుక్ లో మెరిశారు. పక్కనే ఓ పిల్లోడు పాప్ కార్న్ ఆఫర్ చేయగా... తీసుకుని తిన్నాడు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లను ఒకే ఫ్రేమ్ లో పెట్టి టెలికాస్ట్ చేశారు. దీంతో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మాజీ కెప్టెన్లు ఉన్నారని ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Next Story