- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేలిన గ్యాస్ సిలిండర్.. ఏకంగా ఐదుగురికి !
ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది.

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లా మనోహరాబాద్ పట్టణంలో మంగళవారం రాత్రి పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ఏకంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఐదుగురు కూలీలు ఈ ప్రమాదంలో గాయపడ్డట్లు సమాచారం అందుతోంది. మనోహరాబాద్ లో నివాసం ఉంటూనే... కొన్ని రోజులుగా అక్కడి పరిసర గ్రామాలలో వరి నాట్లు వేస్తున్నారు ఈ బీహార్ కూలీలు.
పనులు ముగించుకొని మంగళవారం రాత్రి వంట చేస్తుండగా.. గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన స్థానికులు... బాధితులను తుఫాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ల పరిస్థితి సీరియస్ గా ఉన్న నేపథ్యంలో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




