- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య ట్రస్ట్ సీఈవో రేసులో మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్
అయోధ్య శ్రీ రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పోస్టుకు మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ దరఖాస్తు చేసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొట్ట మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవి కోసం జరుగుతున్న ఎంపిక ప్రక్రియ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అత్యున్నత పదవి రేసులోకి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా చేరారు. ఆయన ఈ పదవి కోసం తన దరఖాస్తును అధికారికంగా అందజేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అమితాబ్ ఠాకూర్ పై పలు శాఖాపరమైన విచారణలు, క్రమశిక్షణా ఫిర్యాదుల అనంతరం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన సర్వీసులో కొనసాగడానికి అర్హులు కారని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సర్వీస్ రూల్స్ ప్రకారం 2021లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయనకు నిర్బంధ పదవీ విరమణ కల్పించింది. పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన అధికార్ సేన పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ చివరికి వెనక్కి తగ్గారు. కాగా..ఇటీవల రామ మందిరంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ పరిపాలన సజావుగా నిర్వహించేందుకు సీఈవోను నియమించాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చే సీఈవో ఆలయ రోజువారీ పరిపాలనను పర్యవేక్షించడం, ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం, ఆర్థిక, సిబ్బంది నిర్వహణను చూసుకోవడం, ఆలయ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.





