లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ.. డ్రైవర్ దుర్మరణం

by velandi.Saikiran |

పూసుగూడెం గ్రామ శివారులో పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ.. డ్రైవర్ దుర్మరణం
X

దిశ, ములకలపల్లి: మండలంలోని పూసుగూడెం గ్రామ శివారులో పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలవరం నుంచి సూర్యాపేటకు సిమెంట్ యాష్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్, అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (ఉత్తరప్రదేశ్) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story