- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ
by velandi.Saikiran |
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెను సంచలనానికి తెరలేపారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 20% పనులకు ఏకంగా రూ.206 కోట్లు కేటాయించడంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలపై నిజా నిజాలు తేల్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అవినీతి నిజంగానే జరిగిందని బయటపడితే... బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా లేఖలో వివరించారు. దీంతో చంద్రబాబుకు వంశీ రాసిన లేఖ హాట్ టాపిక్ అయింది.
Next Story





