- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anthropic: భారత్‌లో క్లాడ్ ఏఐ సబ్‌స్క్రిప్షన్ ధరలు ప్రకటించిన ఆంథ్రోపిక్
డాలర్లలో చెల్లింపుల అవసరం లేకుండా నేరుగా రూపాయల్లోనే క్లాడ్ ఏఐ సేవలను అందించేందుకు కంపెనీ సిద్ధమైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారత మార్కెట్‌కు సంబంధించి క్లాడ్ ఏఐ సబ్‌స్క్రిప్షన్ ధరల వివరాలను ప్రకటించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా మారుతున్న నేపథ్యంలో, ఆంథ్రోపిక్ డాలర్లలో చెల్లింపుల అవసరం లేకుండా నేరుగా రూపాయల్లోనే క్లాడ్ ఏఐ సేవలను అందించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా క్లాడ్ ప్రో నెలవారీ ప్లాన్ రూ. 2,000కు అందుబాటులో ఉండగా, ఎక్కువ పరిమితులు, రద్దీ సమయాల్లో యాక్సెస్ అందించేలా క్లాడ్ మ్యాక్స్ ప్లాన్ ధర నెలకు రూ. 11,999 నుంచి అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ధరలు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో కొత్త సబ్‌స్క్రిప్షన్‌లకు అందుబాటులో ఉండగా, కార్డ్ చెల్లింపులకూ అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థానిక కరెన్సీల్లో ధరలను అందించే వ్యూహంలో భాగంగానే ఆంథ్రోపిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఏఐ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ మార్కెట్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది. ఇదే సమయంలో ఓపెన్ఏఐ సహా ఇతర గ్లోబల్ ఏఐ కంపెనీలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెంచుతున్నాయి. అధునాతన ఏఐ మోడళ్లను దేశంలోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిన కారణంగా, భారత ఏఐ మార్కెట్ కోసం గ్లోబల్ కంపెనీల మధ్య పోటీ మరింత వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.






