ఫీజుల బకాయిలు విడుదల చేయాలి.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్

by Kodari Anjali |

14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ లు, రియంబర్స్ మెంట్ ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు.

ఫీజుల బకాయిలు విడుదల చేయాలి.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్
X

దిశ, రాంనగర్: 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ లు, రియంబర్స్ మెంట్ ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకుహైదరాబాద్, ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పలువురు నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈసందర్భంగా బీసీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు బకాయిల చెల్లింపులో పాత విధానాన్ని కొనసాగించాలన్నారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునినిలిచిపోయిన ఫీజులుచెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అనంతయ్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story