- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరిన్ని పతకాలు సాధించాలి.. డీఎస్పీ నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు
డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో నిఖత్ సాధించిన అద్భుత విజయాలపై డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

దిశ,తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ పోలీసు శాఖలో నూతనంగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్.. మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో నిఖత్ సాధించిన అద్భుత విజయాలపై డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభతో దేశానికి, రాష్ట్రానికి ఆమె ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఆమె విజయాలు రాష్ట్ర యువతకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని డీజీపీ పేర్కొన్నారు.
తాను కూడా క్రీడాకారుడినే అని గుర్తుచేస్తూ, విజయాలకు క్రమశిక్షణ, శ్రమ అవసరమన్నారు. భవిష్యత్తులోనూ ఒకవైపు పోలీసు అధికారిణిగా, మరోవైపు అంతర్జాతీయ బాక్సర్‌గా సమన్వయం చేసుకుంటూ అద్భుత విజయాలు సాధించాలని ఆమెకు డీజీపీ ఆకాంక్షించారు. అనంతరం డీఎస్పీ నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. తన క్రీడా ప్రతిభను గుర్తించి డీఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. దేశానికి, పోలీసు శాఖకు తన ఆట ద్వారా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మరింత కీర్తి తీసుకొస్తానని నిఖత్ స్పష్టం చేశారు.






