‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ ముగింపు వేడుకల్లో టామ్ క్రూజ్ స్టంట్.. పర్ఫార్మర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

by Kema Shiva Kumar |

ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరగునున్నాయి.

‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ ముగింపు వేడుకల్లో టామ్ క్రూజ్ స్టంట్.. పర్ఫార్మర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా ప్రపంచ కప్-2026 (FIFA World Cup 2026) క్లోజింగ్ సెర్మనీకి సర్వం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ ముగింపు సందర్భంగా ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ వేడుకల్లో హాలీవుడ్ సూపర్ స్టార్, యాక్షన్ కింగ్ టామ్ క్రూజ్ (Tom Cruise) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాడు. తన రియలిస్టిక్ యాక్షన్ స్టంట్లతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న టామ్ ఈ వేడుకల్లో ఓ అద్భుతమైన లైవ్ స్టంట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

గ్లోబల్ స్టార్ల ప్రదర్శనలు..

ముగింపు వేడుకల్లో టామ్ క్రూజ్‌తో పాటు ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారులు, పాప్ సింగర్లు, వివిధ దేశాల సాంస్కృతిక బృందాలు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. స్టేడియం పైకప్పు నుంచి కిందకు దూకే ఓ సాహసోపేతమైన స్టంట్‌ను ఆయన లైవ్‌లో ప్రదర్శించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ పాప్ ఐకాన్స్ ఈ వేడుకల్లో తమ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌లతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో సంస్కృతులను ప్రతిబింబించేలా ప్రత్యేక డ్యాన్స్‌లో ఉండనున్నాయి.

Next Story