- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖనిజ దోపిడీకి వ్యతిరేకంగా వెలిసిన మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు
మేమున్నాం.. ఉద్యమం బతికే ఉంది.. అంటూ మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు.

దిశ, భద్రాచలం: మేమున్నాం.. ఉద్యమం బతికే ఉంది.. అంటూ మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు లభ్యం కావడంతో భద్రతా బలగాలు ఉలిక్కిపడ్డాయి. 'లాల్ సలామ్' నినాదంతో ప్రచురించిన లేఖలో కొత్త, మరియు ఇప్పటికే ఉన్న ఇనుప ఖనిజం కంపెనీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బ్యానర్లు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సంఘటన తర్వాత, గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ పోలీసులు ఉమ్మడి స్థాయిలో తమ కార్యకలాపాలను పెంచారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. గడ్చిరోలిలోని ఎటపల్లి తాలూకాలోని జ్యువేలి, పిప్లి, బుర్గి ప్రాంతాల్లో మావోయిస్టుల కరపత్రాలు లభ్యమయ్యాయని, ఓం సాయి, నేచురల్, సన్‌ఫ్లవర్‌తో సహా ఐరన్ ఓర్ కంపెనీలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఐక్యంగా ఉద్యమించాలని 'అశోక్ కమ్రాద్' పేరుతో ప్రచురించిన లేఖలో కోరారు. ప్రతి గ్రామ సర్పంచ్ ఈ కంపెనీలను వ్యతిరేకించాలని, కొత్త, పాత మైనింగ్ ప్రాజెక్టులను పూర్తిగా మూసివేయాలని లేఖలో పేర్కొన్నారు. గడ్చిరోలిలో మావోయిస్టుల ఉద్యమం బలహీనపడిందని అధికార యంత్రాంగం పదే పదే చెబుతుండగా, కరపత్రం, బ్యానర్స్ వెలవడంతో భద్రతా బలగాల్లో కలకలం రేపింది. మరోవైపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు మరోసారి అలర్ట్ ప్రకటించారు.






