ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా చోరీ.. నగదు, బంగారం అపహరణ

by Taduka Kalyani |

ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి నగదు, బంగారం అపహరించిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజరంపేట గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది.

ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా చోరీ.. నగదు, బంగారం అపహరణ
X

దిశ, కౌడిపల్లి: ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి నగదు, బంగారం అపహరించిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజరంపేట గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భుజరంపేట గ్రామానికి చెందిన సండ్రు వెంకటేశం, ఆయన భార్య సునీత వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం సునీత పొలానికి వెళ్లగా, వెంకటేశం పనిమీద మెదక్‌కు వెళ్లారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో వెంకటేశం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి చేరుకున్న ఆయనకు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టిన స్థితిలో కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి పరిశీలించగా బెడ్‌రూమ్ తలుపు తాళంతో పాటు బీరువా తాళం కూడా ధ్వంసం చేసి ఉన్నట్లు గుర్తించారు. బీరువాలోని లాకర్‌ను పరిశీలించగా రూ.18 వేల నగదు, నాలుగు తులాల బంగారం కనిపించలేదు. వెంటనే పొలం వద్ద ఉన్న భార్య సునీతకు సమాచారం అందించడంతో ఇద్దరూ కలిసి ఇంట్లో పరిశీలించారు. చోరీ జరిగిన విషయంపై వెంకటేశం కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అమరేందర్ రెడ్డి తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story