తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు : కాసుల బాల్‌రాజ్

by Batti.Sumithra |

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు.

తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు : కాసుల బాల్‌రాజ్
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఫిల్టర్ బెడ్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న నీటి శుద్ధి, సరఫరా విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు నిరంతరంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పంపిణీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. సింగూర్ నుంచి వచ్చే పైప్‌లైన్ పగిలి, లీకేజీల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా మూడు రోజుల పాటు నిలిచిపోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్టర్ బెడ్‌లోని వాటర్ సప్లై నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఖలేఖ్, బోడ భాస్కర్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story