- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి కోసం వెనక్కి తగ్గిన కొడుకు.. సందీప్ కిషన్ సినిమా వాయిదా!
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నలేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ ‘సిగ్మా’.

దిశ, సినిమా: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నలేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ ‘సిగ్మా’. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తుండగా.. భారీ అంచనాల మధ్య జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తుంది. జులై 24 దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటింటిన ‘జననాయగన్’ సినిమా రిలీజ్ ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద తండ్రితో పోటీ వద్దు అని నిర్ణయించుకున్న ‘సిగ్మా’ డైరెక్టర్ జాసన్ సంజయ్ తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు టాక్. ఈ మేరకు దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.






