ఔటర్ పై కారు పల్టీలు.. డెంటల్ విద్యార్థిని మృతి

by Taduka Kalyani |

ఔటర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల డెంటల్ విద్యార్థిని మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఔటర్ పై కారు పల్టీలు.. డెంటల్ విద్యార్థిని మృతి
X

దిశ, శంషాబాద్: ఔటర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల డెంటల్ విద్యార్థిని మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. శంషాబాద్పో లీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన అడ్డంకి అమూల్య (21) ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీలో చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ్‌తో కలిసి కారులో శంషాబాద్ వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో దారి తప్పి పెద్ద అంబర్‌పేట్ వైపు వెళ్లే మార్గంలోకి వెళ్లారు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ టోల్‌గేట్ దాటిన అనంతరం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఆమె నడుపుతున్న TS09 EX 4976 నెంబర్ గల కారు అదుపుతప్పి రోడ్డు కుడివైపున్న డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టి ఎదురు వైపు రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో అమూల్య తలకు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న సిద్ధార్థ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి అడ్డంకి మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story