- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. వరదలా ప్రవహిస్తున్న తాగునీరు
by Batti.Sumithra |
బాన్సువాడ పట్టణ ప్రజలకు నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడడంతో తాగునీరు వృథాగా పారిపోతోంది.

X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణ ప్రజలకు నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడడంతో తాగునీరు వృథాగా పారిపోతోంది. లీకేజీ మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున మరో మూడు రోజుల పాటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు పట్టణ ప్రజలు తమ తాగునీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ బోర్ల ద్వారా నీటిని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. పైప్‌లైన్ లీకేజీ మరమ్మత్తు పనులు పూర్తయిన అనంతరం యథావిధిగా తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ మేరకు పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.
Next Story






