- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ భట్టు రమేష్
తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ భట్టు రమేష్ నియమితులయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, టూరిజం ప్రొఫెసర్ భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ.శ్రీదేవసేనను ఆ బాధ్యతల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ భట్టు రమేష్‌ను డెప్యుటేషన్‌పై ఏడాది కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లుగా తెలిపారు. డైరెక్టర్ పోస్టుకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ నిబంధనల నుంచి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నూతన డైరెక్టర్‌గా నియమితులైన ప్రొఫెసర్ భట్టు రమేష్‌ను తక్షణమే విధుల్లో చేరేందుకు వీలుగా రిలీవ్ చేయాల్సిందిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ను ప్రభుత్వం కోరింది.






