మేడికొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

by Ratna Kumari |

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మేడికొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం నుంచి గద్వాల వైపు వస్తున్న TS07EU2460 నంబర్ గల స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గద్వాల ప్రాంతానికి చెందిన శివ, రంగ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story