- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలు తక్కువ - ఆందోళన వద్దు: రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచనలు
ఈ ఏడాది రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాల, భారత వాతావరణ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని ఎల్‌నినో పరిస్థితులతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వర్షపాతం తక్కువగా ఉన్నందున జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని, శాస్త్రవేత్తలు సూచించిన విధంగా తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే అధిక దిగుబడి పంట రకాలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు.
అనంతరం భారత వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వచ్చే మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులు సూచించారు. భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ జిల్లాల వారీగా భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు. కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును పెంచాలని ఐఐఎంఆర్ డైరెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్గోపి, సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు రాహుల్ రాజ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్తాస్ జానయ్య, శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప పాల్గొన్నారు.






