పురుగుల మందు తనే తాగాడా.. ఎవరైనా బలవంతంగా తాగించారా..?

by Taduka Kalyani |

పురుగుల మందు తనే తాగాడా..? ఎవరన్నా బలవంతంగా తాగించారా..? ఆత్మహత్య చేసుకునేది ఉంటే ఆ రోజే చేసుకునే వాడేమో..? అంత కట్టు కథనేమోనని బాధిత కుటుంబం, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పురుగుల మందు తనే తాగాడా.. ఎవరైనా బలవంతంగా తాగించారా..?
X

దిశ, చేవెళ్ల : లోక కళ్యాణ అర్థం..! ఏదైనా మంచిదేంటున్నా జనం పురుగుల మందు తనే తాగాడా..? ఎవరన్నా బలవంతంగా తాగించారా..? ఆత్మహత్య చేసుకునేది ఉంటే ఆ రోజే చేసుకునే వాడేమో..? అంత కట్టు కథనేమోనని బాధిత కుటుంబం, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటలుగా ఇదే అంశంపై చర్చ సాగుతుంది. ఏదేమైనా ఆరు మందిని పొట్టన పెట్టుకున్న సైకో కిల్లర్ ఆత్మహత్య చేసుకోవడంతో అంతర ఊపిరి పిలుచుకున్నారు. కానీ సూసైడ్ నోట్లో నలుగురు పేర్లు రాసి చావడం నమ్మశక్యంగా లేదని మైనర్ బాలిక బంధువులు కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అమ్మాయిని వేధిస్తున్నాడని నిలదీస్తే డబ్బులు డిమాండ్ చేయడం అనేది పూర్తి అవాస్తమని కుటుంబ సభ్యులు బంధువులు పేర్కొంటున్నారు. కావాలనే మైనర్ బాలిక కుటుంబంపై బురదజల్లే కార్యక్రమం లో భాగంగానే అతని సెల్ఫీ వీడియో ఉందని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తను చెప్పినట్టే డబ్బులు డిమాండ్ చేస్తే చనిపోయిన కుటుంబం సభ్యులు ఆర్థికంగా మరింత మెరుగుపడేవారు కదా అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. మైనర్ బాలిక తండ్రి ప్రభుత్వ ఉద్యోగి... ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్ డబ్బులు ప్రతి నెల ప్రభుత్వం నుండి బాలిక తల్లికి వస్తుంది. బాధ్యత మైనర్ బాలిక కుటుంబం బ్లాక్ మెయిల్ చేయాల్సిన కర్మ పట్టలేదని బంధువులు చెబుతున్నారు. కావాలనే మైనర్ బాలిక పై కన్నేయడం తో తల్లి, నానమ్మ ప్రశ్నించడం.. రాజ్ కుమార్ నిలదీసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు అయింది. మైనర్ బాలిక అంత వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసేది ఉండే .. లేదంటే ఇదే సెల్ఫీ వీడియో 6 మందిని చంపకు ముందు చేసి తను సూసైడ్ చేసుకుంటే నిజమేనని అందరు నమ్మేవారని కానీ కావాలని దురుద్దేశంతోనే మైనర్ బాలిక కుటుంబంపై డబ్బులు డిమాండ్ చేశారని నెపంతో బదనాం చేయడం కోసమే ఆ వీడియో చేసినట్లు కనిపిస్తుంది అని బాధ్యత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు.

రాజ్‌కుమార్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు దర్యాప్తులో కీలకం..

తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన షాబాద్‌ ఆరు హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌కుమార్ నేరాల వెనుక దాగి ఉన్న కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హత్యలకు ముందు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన తర్వాత... పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రాజ్‌కుమార్ వెనుక అసలు కథ ఏంటి?తనకంటే ఆరేళ్లు పెద్దదైన ట్యూషన్ టీచర్‌ను ప్రేమించి... చివరకు పెళ్లి చేసుకున్న రాజ్‌కుమార్... ఎలా కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాడు? ప్రేమతో ప్రారంభమైన ఆ బంధం... ఎందుకు సామూహిక హత్యలతో ముగిసింది? అసలు రాజ్‌కుమార్‌ను నరరూప రాక్షసుడిగా మార్చిన పరిస్థితులు ఏంటి?ఈ వీడియోలో డీటైయిల్‌గా తెలుసుకుందాం.

నేను చేసిన తప్పుకు నేనే శిక్ష వేసుకున్న..
నేను చేసిన తప్పుకు నేనే బలవుతున్నా.. అన్ని విధాలా మోసపోయా..

షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోగా.. అసలు ఆ హంతకుడు అంతటి ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టాడు..? చంపడానికి ముందే రికార్డ్ చేసిన ఆ సెల్ఫీ వీడియోలో ఉన్న నిజాలు ఎంత వరకు.. కరెక్ట్ అని పోలీస్ లు లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని షాబాద్ వాసులు పేర్కొంటున్నారు.నిదింతుడు సెల్ఫీ వీడియో.. సూసైడ్ నోట్ తో రాసి సూసైడ్ చేసుకున్నాడు..ఎంత వరకు కేసు నిలబడుతుందని .. ఆరు మంది చంపక ముందే ఇదే సెల్ఫీ వీడియో పెట్టి ఉంటే రాజ్ కుమార్ నిజoగానే సైకో కిల్లర్ కాదనుకునేవాళ్ళం....ఇపుడు ఈ కేసు ఎటు నుండి ఎటువంటి మాలువు తీసుకుందని చర్చ నడుస్తుంది. రాజ్ కుమార్ ఆరు మంది ని హత్య చేయకుండా ఆత్మహత్య చేసుకుంటే కేసు మరోలా ఉండేదని..దీని లోతుగా పోలీసుల విచారణ చెప్పడితే తప్ప అసలు విషయం బయటకు రాదని చెబుతున్నారు ప్రజలు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మైనర్ బాలికను వేధించడం నుంచి ప్రారంభమైన వివాదం చివరకు ఆరు ప్రాణాలను బలిగొనడం, అనంతరం ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ పెంజర్ల గ్రామంలోని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. అయితే ఈ ఘటనలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే 'ఈ మారణకాండను పోలీసులు ముందుగానే అడ్డుకోగలిగేవారా...?' బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రజాసంఘాలు చెబుతున్న వివరాలు చూస్తే ఈ దారుణం ఒక్కసారిగా జరిగిన నేరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిందితుడి బెదిరింపులు, పోక్సో కేసు, పలుమార్లు చేసిన ఫిర్యాదులు, బాధిత కుటుంబానికి ఉన్న ప్రాణహాని హెచ్చరికలు అన్నీ ముందే ఉన్నప్పటికీ పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

గ్రామానికి చెందిన మైనర్ బాలికను రాజ్ కుమార్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, కాలేజీకి వెళ్లే సమయంలో వెంటపడటం, ఫోన్ ద్వారా ఇబ్బందులకు గురిచేయడం, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు తరచూ జరిగేవని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబం మే నెలలో పోలీసులను ఆశ్రయించింది. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత కొంతకాలం పరారీలో ఉన్న అతడు అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక్కడి నుంచే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. బెయిల్ పై విడుదలైన తర్వాత రాజ్ కుమార్ ప్రవర్తన మరింత దూకుడుగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. తనపై కేసు పెట్టిన వారిని అంతం చేస్తానని, బాలిక కుటుంబాన్ని వదిలిపెట్టనని, ఎవరూ తనను ఏమీ చేయలేరని బహిరంగంగా హెచ్చరించాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ బెదిరింపుల విషయాన్ని బాధిత కుటుంబం మళ్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే నిందితుడిని పిలిచి హెచ్చరించడం తప్ప మరే కఠిన చర్యలు షాబాద్ పోలీస్ లు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం తో ఇంత ఘోరం జరిగిందని చెప్పవచ్చు.

పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమేనా..?

ఈ కేసులో అత్యంత తీవ్రమైన విమర్శ పోలీసు యంత్రాంగంపైనే ఉంది. ఇప్పటికే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, బాధిత కుటుంబాన్ని బహిరంగంగా బెదిరిస్తున్నాడని ఫిర్యాదులు అందినా అతనిపై నిర్బంధ చర్యలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిసినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం గా ఉండి...స్పందించలేదని.. స్థానికులు ప్రశ్నిస్తున్నారు. షాబాద్ సీఐ, ఎస్సై స్థాయిలో వచ్చిన ఫిర్యాదులను అత్యంత సీరియస్ గా తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలో మరింత సంచలనంగా మారిన అంశం నిందితుడు, కొందరు పోలీసు అధికారుల మధ్య డబ్బులు ట్రాన్జక్షన్ జరిగిoదని పెద్ద మొత్తం లో డబ్బులు ముత్తాజెప్పారని ఆరోపణలు వచ్చాయి. పోక్సో కేసులో కఠిన సెక్షన్లు నమోదు కాకుండా ఉండేందుకు, కేసు విషయంలో సహకారం పొందేందుకు సుమారు రూ.20 లక్షల వరకు డీల్ (ఓ ప్రజా ప్రతినిధి ) ను చేసినట్లు గ్రామస్థుల మధ్య ప్రచారం జరుగుతోంది.

రాజ్కుమార్ మృతదేహం.. ఆత్మహత్యా...? లేక హత్యా...?

రాజ్ కుమార్ మరణం కేసులో మరో మిస్టరీగా మారింది. ఆరుగురు హత్యల అనంతరం తీవ్ర ఒత్తిడికి గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక అతడిని ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించారు. కాల్ డేటా, మొబైల్ ఫోన్, చివరిసారిగా అతడు కలిసిన వ్యక్తులు, ప్రయాణ మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కంటితుడుపు చర్యలా..?

ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ, అవి కేవలం కంటి తుడుపు చర్యలేనని షాబాద్ వాసులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పటి నుంచి హత్యలు జరిగే వరకు పోలీసుల పాత్ర ఏమిటి..? ఎక్కడ లోపం జరిగింది..? ఎవరెవరు బాధ్యులు..? వారి పాత్ర ఎంతవరకు ఉందని ఫ్యూచర్ సిటీ కమిషనర్ షాబాద్ పోలీస్ల ఫ్యూచర్ ను డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందని షాబాద్ ప్రజలు అంటున్నారు.

అనేక సందేహాలు..?

షాబాద్ మారణకాండ ఇప్పుడు కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు. ఇది ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినప్పుడు, బెదిరింపులను చిన్నచూపు చూసినప్పుడు, బాధితులకు రక్షణ కల్పించడంలో వ్యవస్థ విఫలమైనప్పుడు ఎలాంటి విషాదాలు సంభవిస్తాయో చూపించిన ఉదంతంగా మారింది. పోక్సో కేసు నమోదైన నిందితుడు బెయిల్పై బయటకు వచ్చి బహిరంగంగా బెదిరించినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? బాధిత కుటుంబానికి రక్షణ ఎందుకు ఇవ్వలేదు? నిందితుడిపై నిఘా ఎందుకు పెట్టలేదు? అతడి మరణం వెనుక అసలు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పుడే షాబాద్ ఆరు హత్యల మిస్టరీ వీడుతోందని చర్చించుకుంటున్నారు.

Next Story