ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. ఫొటో గ్రాఫర్లకు హీరోయిన్ వార్నింగ్

by Chukka Sudharani |   (  Updated:2026-07-14 15:45:58  IST  )

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఈ మధ్య కొంత మంది ఫొటోగ్రాఫర్లు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.

ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. ఫొటో గ్రాఫర్లకు హీరోయిన్ వార్నింగ్
X

దిశ, సినిమా: సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఈ మధ్య కొంత మంది ఫొటోగ్రాఫర్లు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వద్దు అంటున్న వారిని ఫొటోలు తీసి ఇబ్బంది పెట్టడమే కాకుండా.. అర్థం పర్థం లేని కామెంట్స్‌తో నటీనటుల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్‌లో చోటుచేసుకుంది. ఫొటోగ్రాఫర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ఫైర్ అయ్యారు. నటి జరీన్ ఖాన్ రీసెంట్‌గా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కారక్యక్రమంలో పొల్గొన్నారు. అక్కడి డ్రెస్సులను పరిశీలిస్తున్న క్రమంలో.. ఫొటో గ్రాఫర్స్‌లో ఒకరు ‘ట్రయల్ వేయొచ్చుగా’ అని అడగటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆ వెంటనే జరీన్ స్పందిస్తూ.. ‘ఏంటీ మీ ముందేనా ట్రయల్ చేయమంటారా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. కొంచెం హద్దుల్లో ఉండండి.. దయచేసి మహిళలతో మర్యాదగా ప్రవర్తించండీ’ అంటూ సదరు కెమెరామెన్‌పై మండిపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. జరీన్ ఖాన్‌కు మద్ధుతుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

చాలా గ్యాప్ తర్వాత కన్నడలోకి.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్

Next Story