చాలా గ్యాప్ తర్వాత కన్నడలోకి.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్

by Chukka Sudharani |   (  Updated:2026-07-14 15:07:40  IST  )

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్ల అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది హన్సిక.

చాలా గ్యాప్ తర్వాత కన్నడలోకి.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్ల అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది హన్సిక. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు దూరం కాగా.. ఇటీవల విడాకులు తీసుకుని ప్రజెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తూనే పలు షోలకు జడ్జీగా వ్యవహిరిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా హన్సిక సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారింది. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ మళ్లీ శాండల్‌వుడ్‌కు తిరిగి ఎంట్రీ ఇవ్వబోతుంది.

దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ సరసన 'బిందాస్' సినిమాతో కన్నడలో అరంగేట్రం చేసిన హన్సిక.. ఆ తర్వాత మళ్లీ కన్నడలో సినిమా చేయలేదు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లకు తన రెండో చిత్రాన్ని ఓకే చేసింది. 'పారడాక్స్' అనే పాన్-ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించబోతుంది. సుదీర్ఘ విరామం తర్వాత కన్నడ చిత్రసీమలోకి హన్సిక తిరిగి వస్తుండగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారింది. కెప్టెన్ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Next Story