- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి పేరుతో రాజకీయాలు చేయొద్దు.. విలేకరుల సమావేశంలో కాపు కృష్ణ
సింగరేణి పేరుతో రాజకీయాలు చేయొద్దని విలేకరుల సమావేశంలో కాపు కృష్ణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: కొత్తగూడెంలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడాన్ని స్వాగతించారు. అయితే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాడిచర్ల-2లో బొగ్గు ఉత్పత్తిని పూర్తిగా సింగరేణి ఉద్యోగులతోనే చేపట్టాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘాలు రెండున్నరేళ్లుగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కోయగూడెం, సత్తుపల్లి ఓసీ-3తో పాటు ఇతర బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం బొగ్గు బ్లాకుల కేటాయింపులో దొడ్డిదారిన తమవారికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కిషన్ రెడ్డి చేపట్టిన "సింగరేణి భరోసా యాత్ర" కార్మికుల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఎద్దేవా చేశారు.






