- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాలి : జిల్లా కలెక్టర్
గ్రామాలు, మున్సిపాలిటీలలో ఇంటింటి నుంచి ఎస్ఐఆర్ ఫారాలను సేకరించిన వెంటనే డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: గ్రామాలు, మున్సిపాలిటీలలో ఇంటింటి నుంచి ఎస్ఐఆర్ ఫారాలను సేకరించిన వెంటనే డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ, ఎస్ఐఆర్ ప్రక్రియ గూర్చి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ అధికారులతో జిల్లా కలెక్టర్ కే. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరికి రెండు చోట్ల ఓటు ఉండకుండా అత్యంత పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్, వార్డు నోడల్ ఆఫీసర్ లు సమన్వయంతో పని చేయాలన్నారు. పట్టణంలో ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకూడదన్నారు. జిల్లాలో ఆయా మండలాల్లో, గ్రామాల్లో లబ్ధిదారులకు అందించి రెండు పడక గదుల్లో నివసిస్తున్న వారి గృహాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ఏఈ లను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి డాక్టర్లను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి..
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదే విధంగా రాఘవాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.






