గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు తీవ్ర అన్యాయం : పున్న కైలాష్ నేత

by Batti.Sumithra |

గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో 10 వేల మంది రైతులు చనిపోయారని, ఏకకాలంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు తీవ్ర అన్యాయం : పున్న కైలాష్ నేత
X

దిశ, శాలిగౌరారం : గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో 10 వేల మంది రైతులు చనిపోయారని, ఏకకాలంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ నట్టేట ముంచిందని, నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ఆనాడు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో డిండి, శ్రీశైలం సొరంగం పనులు, చర్లగౌరారం, కిష్టారంపల్లి, బ్రాహ్మణవెల్లంల, శాలిగౌరారం ప్రాంతంలోని అసిఫ్‌నగర్ కాల్వను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసిఫ్‌నగర్ కాల్వ పరిధిలోని రైతాంగానికి నష్టపరిహారం అందించి, కాల్వ పనులను చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బాంధవుడిగా రైతులకు రైతు భరోసాను ఏకకాలంలో అందించారని అన్నారు. సన్న వడ్లకు బోనస్, రూ.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, చేనేత బీమా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకేనని, రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, 2029లో సీఎంగా రేవంత్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు అసమర్థ పాలనతో జిల్లాను అభివృద్ధి చేయలేదన్నారు. కాలేశ్వరం కూలింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని చూసి సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అన్నే బోయిన సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత ధనంజయ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండపల్లి కొమురయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తోటకూరి పరుశరామ్, శాలిగౌరారం సర్పంచ్ శేఖర్ బాబు, ఉపసర్పంచ్‌లు పాపారావు, భాషా, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపినాథ్, మండల అధ్యక్షుడు బొల్లికొండ గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపతి అంజయ్య, తిరుపారి మల్లయ్య, నోముల జనార్ధన్, భూపతి వెంకన్న, నోముల రవి, జమ్ము అశోక్, మంగదుడ్ల శ్రీనివాస్, పెరుమాండ్ల నరేష్, వడ్లకొండ పరమేష్, యంగలి రామకృష్ణ గౌడ్, ఆకుల శీను, ఇందనూరి శీను, నూక మహేష్, రాచకొండ యాదగిరి, వేముల లక్ష్మణ్, మాచర్ల కృష్ణ, బందెల ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story