- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒరిస్సా టూ గుజరాత్ కు గంజాయి తరలింపు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.

దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరు సీఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో మొత్తం 20.898 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలోని బెరహంపూర్ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10.44 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన నిందితులను గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన గురు లోకనాథ్ పాత్ర, ఇజ్రాయిన్ ఖాసిం సంధ్వానీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక బ్యాగ్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






