రైతు బజార్ లో దుకాణాలు మూసివేత..

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో రెండు రోజులుగా దుకాణాలు మూతపడ్డాయి.

రైతు బజార్ లో దుకాణాలు మూసివేత..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో రెండు రోజులుగా దుకాణాలు మూతపడ్డాయి. రైతు బజార్ లో రైతుల కంటే దళారుల ఆధిపత్యమే ఎక్కువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ మార్కెట్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్‌లో జరుగుతున్న అక్రమాల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story