- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. కాపు నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) కాసేపటి క్రితం కన్నమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అయితే, ముద్రగడ మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.
ముద్రగడ రాజకీయ ప్రస్థానం ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ముద్రగడ పద్మనాభం జన్మించారు. పాఠశాల, ఉన్నత విద్యాను జిల్లాలో పూర్తి చేశారు. మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి వీరాభిమాని అయిన వాళ్ల తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాత్తుగా మరణించారు. దీంతో నీలం సంజీవరెడ్డి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇక 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయబోనని ప్రకటించారు. 2009లో వైఎస్ ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మళ్లీ అపజయాన్ని మూటగట్టుకున్నారు. అనంతరం కాపు సోదరులు విజ్ఞప్తి మేరకు ముద్రగడ కాపు ఉద్యమ బాధ్యతను స్వీకరించారు.
కాపు నాయకుడిగా గుర్తింపు..
అయితే, 1988 ప్రాంతంలో ఓ ఘటనకు సంబంధించి ముద్రగడ పద్మనాభం అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తరకంచి పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దళితులు, బీసీలని తెలిసి నేరుగా స్టేషన్‌కు వెళ్లగా.. ఆయనను పోలీసులు స్టేషనలోకి రానివ్వలేదు. ఒక చేసేదమి లేక ముద్రగడ స్టేషన్ ఎదుటే టెంటు వేసి ఐదు రోజులు బైఠాయించి ఆమరణ దీక్షను ప్రకటించారు. ఆ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తరకంచి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తప్పక పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించింది. ఆ ఘటన తరువాత ముద్రగడ పద్మనాభానికి కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది.
రైల్ రోకోతో భారీ విధ్వంసం..
ముద్రగడ పద్మనాభం 1994లో ఓ కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. నాటి సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో నెంబర్.30 ని జారీ చేయించేలా ఒత్తిడి తెచ్చారు. అదే జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇవ్వగా.. అనంతరం డివిజన్ బెంచ్ సమర్థించింది. అదేవిధంగా 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి.కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్లు - రైళ్ల రోకోలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో భారీ విధ్వంసం జరిగింది.
చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి.. పేరు మార్పు
2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని ముద్రగడ పద్మనాభం ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరగపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. అనూహ్యంగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారా మెజారిటీతో పిఠాపురం నుంచి గెలుపొందారు. సవాల్ ఓడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నట్లుగా ప్రకటించుకున్నారు.






