- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడ పద్మనాభం కన్నుమూత: ఫోన్‌లో పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపిన వైఎస్ జగన్!
ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం.. ఆయన కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి పరామర్శ!

దిశ, వెబ్ డెస్క్: కాపు సంక్షేమ ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన మరణ వార్త పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసిన జగన్.. ఆయనను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ముద్రగడ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆయన సేవలు చిరస్మరణీయం – జగన్ నివాళి
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. "ముద్రగడ పద్మనాభం హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు, అందించిన సేవలు రాజకీయ చరిత్రలో చిరస్మరణీయం. నిబద్ధత గల నాయకుడిగా ప్రజా హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం ఎప్పటికీ నిలిచిపోతుంది" అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ప్రార్థించారు. ముద్రగడ మృతి పట్ల పలువురు వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు కూడా విచారం వ్యక్తం చేశారు.






