ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్

by Kodari Anjali |

అడిషనల్ కలెక్టర్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి డి వేణుగోపాల్ ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్
X

దిశ, అశ్వారావుపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట రైతు వేదికలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి డి వేణుగోపాల్ ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓ సహాయకులు. బీఎల్‌వో సూపర్వైజర్లు బూత్ స్థాయి ఏజెంట్ లు, అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్ నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు, అశ్వారావుపేట టౌన్ స్థాయి అధికారులతో సర్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం తీసుకోవాల్సిన పలు సూచనలను చేశారు. ఆశ్వారావుపేట టౌన్‌లో ఉన్న 16 పోలింగ్ కేంద్రాలలో గల మొత్తం ఓటర్లు (17.151) గా ఉండగా అందులో ఈరోజు వరకు బీఎల్‌వో లచే ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ చేసినవి వారు (5201) గా వుండి 38.04 శాతంగా గా నమోదయిందని తెలిపారు. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయవలసినదిగా బూత్ స్థాయి అధికారులను, బిఎల్ఓ సహాయకులను, బీఎల్వో సూపర్వైసర్ లను ఆదేశించారు.

త్వరగా డిజిటలైజేషన్ చేయవలెనని

బూత్ స్థాయి ఏజెంట్ లు (బిఎల్ఏ) రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధుల సమన్వయంతోటే ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ సులబతరం అవుతుందన్నారు. అదేవిధంగా బూత్ స్థాయి ఏజెంట్ లు, నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ లను ఎన్యూమరేషన్ పత్రాలను పూరించుట మరియు డిజిటలైజేషన్ చేయుటకు పూర్తి సహకారం అందించి వంద శాతం డిజిటలైజేషన్ అయ్యేటట్లు సహకరించమని కోరారు. అలాగే ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ లో తక్కువ పర్సెంటేజ్ ఉన్నవారిని త్వరగా డిజిటలైజేషన్ చేయవలెనని ఆదేశించారు. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెల 24వ తేది లోపు వంద శాతం ఎట్టి పరిస్థితులలో పూర్తి చేయాలన్నారు. ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో, ఏఈఆర్వో తహశీల్దార్ డి కిశోర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్. అశ్వారావుపేట టౌన్ కౌన్సిలర్ లు, నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎన్నికల నాయబ్ తహశీల్దార్ సయ్యద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ టి దిలీప్ రెడ్డి, ఎంపీడీవో వి. కిశోర్, ఇరిగేషన్ డిఈఈ వేంకటేశ్వర రావు మరియు ఏసిడిపిఓ నవ్యశ్రీ పాల్గొన్నారు.

Next Story