- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు పొందిన హోటళ్లకు మాత్రమే స్విగ్గీ, జొమాటో ప్లాట్ ఫామ్‌లో సభ్యత్వం కల్పించాలి
ఆహార భద్రత, ప్రజారోగ్యం వినియోగదారుల రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దిశ, శేరిలింగంపల్లి: ఆహార భద్రత, ప్రజారోగ్యం వినియోగదారుల రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదైన ఆహార వ్యాపార సంస్థల ఆన్‌బోర్డింగ్, పర్యవేక్షణ నిర్వహణకు సంబంధించి స్విగ్గీ, జొమాటో సంస్థలకు సిఎంసి కమిషనర్ సృజన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్, రిజిస్ట్రేషన్ , సీఎం సి జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్ కలిగిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను మాత్రమే తమ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదు చేయాలని ఆదేశించారు. లైసెన్స్ గడువు ముగిసిన, సస్పెండ్ లేదా రద్దు చేయబడిన,డీ-లిస్ట్ చేయాలని ఆదేశించిన ఆహార వ్యాపార సంస్థలను తక్షణమే ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. ఆహార నాణ్యత రేటింగ్స్, పరిశుభ్రత రేటింగ్స్ వినియోగదారుల సమీక్షలకు సంబంధించి అనుసరిస్తున్న ప్రమాణాలు, విధానాలను, నియంత్రణ సమీక్ష కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సమర్పించాలన్నారు.
అవసరమైన సందర్భాల్లో మాత్రమే చర్యలు తీసుకోవాలి..
సమాచార మార్పిడి, కంప్లయన్స్ నివేదికలు, తనిఖీలు ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ అధికారిని నియమించి, సీఎంసీతో అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్విగ్గీ, జొమాటో సంస్థలను ఆదేశించారు.వినియోగదారులు ఇచ్చే ప్రతికూల సమీక్షలు, రేటింగ్స్‌ను తొలగించడం, మార్చడం చేయరాదని, తప్పనిసరి వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ విధానం ప్రకారం అవసరమైన సందర్భాల్లో మాత్రమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాట్‌ఫారమ్‌లో నమోదైన ప్రతి ఆహార సంస్థ యొక్క ఖచ్చితమైన జియో-లొకేషన్‌ను ధృవీకరించి అనుమతి పొందిన, నమోదైన ప్రాంగణం నుంచే ఆహారం తయారు చేసి డెలివరీ చేయబడుతున్నట్లు నిర్ధారించాలని ఆదేశించింది. ప్రతి ఆహార వ్యాపార సంస్థ వద్ద చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్ ప్రదర్శించాలన్నారు. సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ కార్యాలయం పరిధిలో తమ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదైన ఆహార సంస్థల జాబితాతో పాటు వివరణాత్మక కంప్లయన్స్ నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని స్విగ్గీ, జొమాటో సంస్థలకు నోటీసులు జారీ చేశారు.ఈ ఆదేశాలను పాటించని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం సంస్థలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.






