- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేటింగ్ యాప్స్‌తో ముసలోడి అరాచకం.. 14 మంది మహిళలను రేప్ చేసిన వైనం
డేటింగ్ యాప్స్‌లో మహిళలను పరిచయం చేసుకుని, మత్తుమందు ఇచ్చి వారిని 68 ఏళ్ల ముసలోడు రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: 68 ఏళ్ల వృద్ధుడు అంటే.. మన మైండ్‌లోకి మొదటగా వచ్చే ఆలోచన.. చక్కగా పెన్షన్ తీసుకుంటూ ఇంట్లో కృష్ణా.. రామా అంటూ కాలం వెళ్లదీసేవాళ్లని అనుకుంటాం. కానీ, జర్మనీ (Germany)లో మాత్రం సీన్ మరోలా ఉంది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ (Online Dating Apps)లను వాడుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ.. ఓ 68 ఏళ్ల వృద్ధుడు చేసిన అరాచకం జర్మనీలో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపాయి. వేర్వేరు డేటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమ్మాయిలు, మహిళలను పరిచయం చేసుకుని, ఆపై వారికి మత్తు మందు ఇచ్చి దాదాపు 14 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా సదరు వ్యక్తిపై జర్మన్ ప్రాసిక్యూటర్లు అధికారికంగా చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఘటన ఆ దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
తెలియకుండా మత్తుమందు ఇచ్చి..
వివరాల్లోకి వెళితే.. బెర్లిన్ (Translating...)కు చెందిన నిందితుడు డేటింగ్ యాప్స్‌లో మహిళలను మాటల్లో పెట్టి, తియ్యగా మాట్లాడుతూ బుట్టలో వేసుకునేవాడు. ఆ తర్వాత వారిని తనతో మీట్ అవ్వాలని ఫోర్స్ చేసేవాడు. అనంతరం గదిలోకి వచ్చాక ఆల్కహాల్‌తో పాటు నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్లు (Sedative Injections) ఇచ్చి మొదట వాళ్లు స్పృహ కోల్పోయేలా చేసేవాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత వారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ సమయంలో బాధితులకు కనీసం స్పృహ కూడా లేకపోవడంతో, తమపై ఈ ఘోరం జరిగినట్లుగా వారికి ఎలాంటి గుర్తూ ఉండేది కాదు. ఈ క్రమంలోనే మరో నిందితుడిపై జరుగుతున్న విచారణలో భాగంగా లభించిన ఆధారాల ఆధారంగా జర్మనీ పోలీసులు సదరు వృద్ధుడి నివాసంపై ఆకస్మికంగా దాడుల చేశారు. సోదాల్లో నిందితుడి ఇంట్లో లభించిన పెన్‌డ్రైవ్ (Pendrives)లు చూసి పోలీసుల మైండ్‌బ్లాంక్ అయింది. అందులో డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయిన సదరు మహిళలపై చేసిన లైంగిక దాడులకు సంబంధించిన అనేక వీడియోలు లభ్యమయ్యాయి. నిత్యం అవి చూస్తూ ఏంజాయ్ చేసే వాడని తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
58 మంది బాధితులు ఉండే చాన్స్..
అయితే, ప్రస్తుతం నిందితుడి వద్ద లభించిన ఆధారాల మేరకు.. 14 మంది మహిళలపై జరిగిన 22 అత్యాచార ఘటనలకు సంబంధించి నిందితుడిపై కఠినమైన సెక్షన్లను పోలీసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో సుమారు 58 మంది మహిళలు బాధితులుగా ఉండే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ వాడే యువత ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి డేంజర్ బెల్స్‌ను మోగించింది.






