- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టు పై నుండి పడిన జూనియర్ లైన్ మెన్ కు తీవ్రగాయాలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత తర్లపాడులో విద్యుత్ విధుల్లో స్తంభానికి సంబంధించిన పనిచేస్తుండగా చెట్టు పై నుంచి కింద పడి జూనియర్ లైన్‌మెన్ తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత తర్లపాడులో విద్యుత్ విధుల్లో స్తంభానికి సంబంధించిన పనిచేస్తుండగా చెట్టు పై నుంచి కింద పడి జూనియర్ లైన్‌మెన్ తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలకై మండలంలోని పాత తర్లపాడు విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మెన్ ఎల్లాబాయి (48) విధి నిర్వహణలో భాగంగా రైతులతో విద్యుత్తు లైను తోటలలోకి వెళ్లే లైను సరి చేయిస్తుండగా అతను చెట్టు ఎక్కి పనిచేస్తుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయమై చెవుల నుంచి రక్తస్రావం అయ్యింది. ఎడమ కాలు కూడా విరిగింది. స్థానికులు గమనించి వెంటనే 108 కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది కృష్ణ, పైలట్ అజర్ హుస్సేన్ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తోటి విద్యుత్ సిబ్బంది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.






